సినిమా
సీబీఐ విచారణకు హాజరైన టీవీకే అధినేత విజయ్

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నేడు సీబీఐ విచారణకు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ముమ్మరం చేసింది.
ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు విజయ్ను విచారిస్తున్నారు. సభ నిర్వహణలో జరిగిన లోపాలు, అంచనాకు మించి తరలివచ్చిన జనం, భద్రతా ఏర్పాట్లపై అధికారుల బృందం విజయ్ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కూడా సీబీఐ నోటీసులు జారీ చేయడంతో తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి.



