తెలంగాణ
Tuition Teacher: చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో 8 చోట్ల వాతలు

Tuition Teacher: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు సంవత్సరాల బాలుడిపై ట్యూషన్ టీచర్ దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. ఓయూ కాలనీకి చెందిన ఒకటో తరగతి విద్యార్థి తేజ నందన్‌ను, చదవడం లేదన్న కారణంతో ట్యూషన్ టీచర్ మానస అట్లకాడతో కొట్టింది. చేతులు, కాళ్లు, ముఖం సహా మొత్తం ఎనిమిది చోట్ల చిన్నారిపై వాతలు పెట్టడంతో అతడు తీవ్రమైన కాలిన గాయాలతో నడవలేని స్థితికి చేరుకున్నాడు.
విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడిని విచక్షణ రహితంగా కాల్చిన టీచర్ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.



