ఆంధ్ర ప్రదేశ్

పవన్ కల్యాణ్ సూచనలను కచ్చితంగా పాటిస్తాం: బీఆర్ నాయుడు

తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షమాపణ చెప్పే అంశం కాకరేపింది. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అధికారులు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు పవన్. దీనిపై పరోక్షంగా స్పందించారు బీఆర్ నాయుడు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయినవారు తిరిగిరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఒక్కసారిగా ఈ వ్యవహారం వేడిక్కింది. మళ్లీ పాలకమండలి సమావేశం తర్వాత.. బయటకు వచ్చిన బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ.. పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సూచనలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని ఆయన తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button