Donald Trump: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ వార్నింగ్
Donald Trump: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని.. లేకుంటే భారీ ఆంక్షలు విధిస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అయితే.. ట్రంప్ మాటలను పుతిన్ ఎంతవరకు వింటారనేది ఆసక్తికరంగా మారింది. పెద్దన్న హెచ్చరికలకు తలొగ్గి యుద్ధానికి పుతిన్ పుల్‌స్టాఫ్ పెడతారా లేకుంటే.. తన పంథా కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశమైంది.
పదవి బాధ్యతలు చేపడుతూనే.. రష్యాకు తీవ్రంగా హెచ్చరించారు ట్రంప్. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే.. రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తులపై భారీగా పన్నుులు, టారిఫ్‌లు విధిస్తామన్నారు.
దాదాపు మూడేళ్ల నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా చనిపోయారు. మరో 28 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణం క్షిపణి దాడి జరుగుతుందోనని ఇరుదేశాల ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు. ఇప్పటికే.. ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని సూచనలు చేశాయి. అయినప్పటికీ పుతిన్ ఏ మాత్రం తగ్గ లేదు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి.. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, కెనడా,.. జపాన్‌తో సహా పలు దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. యుద్ధాన్ని ఆపాలని కోరాయి. అయితే వీటిని ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఉక్రెయిన్‌పై దాడులు మరింత ఉధృతం చేశాయి. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినప్పుడే.. ప్రపంచ దేశాల ఒత్తిడిలకు తలొగ్గని పుతిన్.. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతుంది.