అంతర్జాతీయం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. శాంతి ప్రణాళిక ఒప్పందంపై ఇజ్రాయెల్-హమాస్ సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలో బందీలు, ఖైదీలు కూడా విడుదల అవుతారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో 20 మంది బందీలు విడుదలయ్యే అవకాశం ఉంది. గాజాలో మెజార్టీ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడనున్నాయి.



