తెలంగాణ
Medak: మహిళపై అత్యాచారం.. వివస్త్రను చేసి.. స్తంభానికి కట్టేసి..

Medak: మెదక్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయానికి అతి సమీపంలోని ఓ వెంచర్ పక్కన ముళ్ల పొదల్లోకి మహిళను తీసుకెళ్లి గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివస్త్రను చేసి స్తంభానికి చేతులు కట్టేశారు. దీంతో ఆమె మృతిచెందింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మహిళను వెంచర్‌లోని స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా తలకు బలమైన గాయం, కుడిచేయి విరిగి ఉంది. మెడ, ఇతర చోట్ల గాయాలయ్యాయి. స్పృహ తప్పిపోయి ఉంది. వెంటనే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాత్రి వరకు స్పృహలోకి రాకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మహిళ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



