ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించారు. ఈ నిర్ణయం భారతీయ సినిమాకు షాక్ ఇచ్చింది. తెలుగు సినిమాలు భారీగా నష్టపోనున్నాయి. టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.
డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించడం భారతీయ సినీ పరిశ్రమకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు అమెరికా బాక్సాఫీస్‌లో నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రీమియర్ టికెట్లు 30-35 డాలర్లుగా ఉండగా, టారిఫ్‌తో ధరలు 50 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
తెలుగు సినిమాలు విదేశీ మార్కెట్‌లో గతంలో సాధించిన విజయాలకు ఈ నిర్ణయం అడ్డంకిగా మారనుంది. సినీ విశ్లేషకులు ఈ టారిఫ్ దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోల హడావిడి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



