Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గా రానున్న వెంకటేష్-త్రివిక్రమ్!

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’గా పేరు పెట్టారు.
విక్టరీ వెంకటేష్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ‘ఆదర్శ కుటుంబం’గా ఈ సినిమాకు పేరు నిర్ణయించారు. ఫ్యామిలీ హీరోగా పేరొందిన వెంకటేష్‌కు ఈ టైటిల్ బాగా సరిపోతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ‘హోమ్ నెంబర్ 47 ఏకే 47’ అనే ట్యాగ్‌లైన్‌తో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు.
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. వెంకీ ఫ్రెష్ లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది.



