సినిమా
త్రిష ఆవేదన..?

Trisha Krishnan: సీనియర్ నటి త్రిష కృష్ణన్ పెళ్లి రూమర్స్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పెళ్లి అంటూ వస్తున్న ఫేక్ న్యూస్‌పై ఆగ్రహం ప్రకటించారు.
సీనియర్ హీరోయిన్ త్రిష కొంతకాలంగా పెళ్లి రూమర్స్‌తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఆమె ఈ ఫేక్ న్యూస్‌పై స్పందించారు. “ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారందరితోనూ పెళ్లి అంటూ రాస్తున్నారు. అలాంటి వార్తలు నాకు అసహ్యం కలిగిస్తున్నాయి. దయచేసి ఇలాంటివి వైరల్ చేయొద్దు” అని త్రిష ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో విజయ్, శింబుతో సంబంధం ఉందని, రూమర్స్ వ్యాపించాయి. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తుంది త్రిష. 41 ఏళ్లు దాటినా కూడా సింగిల్‌గానే ఉండటంతో ఈ పుకార్లు మరింత బలపడుతున్నాయి. అయితే సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్టు ఆమె స్పష్టం చేశారు.



