తెలంగాణ

TG: రవాణాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలోని అన్ని చెక్‌పోస్టులు మూసివేత

TG: తెలంగాణ రవాణా శాఖా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని చెక్ పోస్టులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖా చెక్ పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏసీబీ దాడుల్లో చెక్ పోస్టుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. గత ఆగస్టులోనే చెక్ పోస్టుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నా కొందరు అధికారుల ఒత్తిళ్ల వల్ల రద్ధు నిర్ణయం అమలు ఇన్నిరోజులూ వాయిదా పడుతూ వచ్చింది.

పలు చెక్‌పోస్టుల్లో భారీగా నగదు పట్టుబడటంతో తక్షణం చెక్‌పోస్టులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసిఏయాలనే ట్రాన్స్‌పోర్టు శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగిస్తున్నారు. సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button