ఆంధ్ర ప్రదేశ్
Palnadu: పల్నాటి వీరుల తిరునాళ్లలో అపశ్రుతి.. ఒకరు మృతి

Palnadu: పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా దేవుడి విగ్రహాలు కడిగేందుకు ఇద్దరు వ్యక్తులు నాగులేరు వాగులో దిగారు. విగ్రహాలు కడుగుతుండగా విద్యుత్ వైరు తెగి నీటిలో పడటంతో వారికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఒక్కరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో ఉత్సవాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.



