తెలంగాణ
కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 యేండ్లు పూర్తి.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్

Deeksha Divas: నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తుంది. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 యేండ్లు పూర్తైంది. ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తుంది. తెలంగాణ భవన్‌లో కేటీఆర్, సిద్దిపేట దీక్షా దివస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనున్నారు. జిల్లా కార్యాలయాల్లో బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు.



