తెలంగాణ

రేవంత్ ప్రభుత్వానికి TNGOS అల్టిమేటం

రేవంత్ ప్రభుత్వానికి TNGOS అల్టిమేటం జారీ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుండి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. రాష్ట్రస్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఇందులో 33 జిల్లాల TNGO అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెండింగ్‌లోని ఐదు DAలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బకాయి బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని PRC కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, 51శాతం ఫిట్‌మెంట్ అమలులోకి తేవాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల హెల్త్‌కార్డులు అమల్లోకి తీసుకురావాలన్నారు. 57 డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామన్నారు. ఇక వచ్చేనెలలోగా సాధారణ బదిలీలు సైతం పూర్తి చేయాలని TNGO డిమాండ్ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button