ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతిలో భారీ వర్షాలు.. కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం

Tirupati: శేషాచల పర్వతం ప్రకృతి అందాల నిలయం. ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనస్సు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఓ వైపు మంచు శేషాచల పర్వతాన్ని ముద్దాడుతుంటే మరో వైపు కపిలతీర్థ జలపాతం నుంచి జల ధారలు కురుస్తుండడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలోని కపిలతీర్థ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం జలపాతం కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. జలపాతాలను సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివస్తున్నారు.



