ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం

కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తోంది. పోలవరం, కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను గుర్తించారు. ప్రత్తిపాడు మండలం దారపల్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవొమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేడియో కాలర్ ద్వారా పులి జాడను గుర్తించారు. ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.



