Tiger Shroff: టైగర్ ష్రాఫ్ బీచ్ క్రికెట్ వైరల్.. ఫన్నీ కౌంటర్!

Tiger Shroff: టైగర్ ష్రాఫ్ బీచ్ క్రికెట్ వైరల్.. ఫన్నీ కౌంటర్!బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ బీచ్‌లో క్రికెట్ ఆడుతూ సందడి చేశాడు. అండర్‌వేర్‌లో ఆడిన వీడియో వైరల్ కాగా, నెటిజన్స్ ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన టైగర్ మరో ఫన్నీ వీడియో షేర్ చేశాడు.
2014లో హీరోపంతితో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్, అల్లు అర్జున్ ‘పరుగు’ రీమేక్‌తో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. బాఘీ, బాఘీ2లతో వరుస హిట్స్ కొట్టిన ఈ యంగ్ హీరో, తాజాగా అక్షయ్ కుమార్, గణేష్ ఆచార్యలతో బీచ్‌లో క్రికెట్ ఆడాడు. కేవలం అండర్‌వేర్‌లో ఆడిన టైగర్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది.
నెటిజన్స్ “చెడ్డీ లీగ్”, “ఊర్ఫీ మేల్ వెర్షన్” అంటూ ట్రోల్ చేయగా, కొందరు అతని ఫిట్‌నెస్‌ను మెచ్చుకున్నారు. ట్రోల్స్‌కు టైగర్ ఫన్నీగా సమాధానమిచ్చాడు. ట్రాక్ ప్యాంట్‌లో క్రికెట్ ఆడుతూ మరో వీడియో షేర్ చేసి, “ఇప్పుడూ అదే జోరు” అని రాసుకొచ్చాడు. కెరీర్ పరంగా టైగర్‌కు ఇటీవల సింగం అగైన్, బడే మియాన్ చోటే మియాన్ నిరాశపరిచాయి. ప్రస్తుతం బాఘీ4తో బిజీగా ఉన్నాడు.