తెలంగాణ
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కలకలం

Tiger: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. జైపూర్ మండలంలోని కుందారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీలగిరి ప్లాంటేషన్ వద్ద పాదముద్రలను గుర్తించిన అధికారులు సమీప గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఎవరూ కూడా అడవిలోకి వెళ్లొద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా గత నాలుగు రోజులు క్రితం భీమారం మండలంలోని దాంపూర్‌లో పెద్దపులి గేదెపై దాడి చేసి హతమార్చింది. ఇక మరోవైను అటు అటవీ శాఖ అధికారులు పెద్దపులిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.