తెలంగాణ
Thummala: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది

Thummala: కేంద్రంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారని ఆరోపిస్తూ మోడీ దిష్టిబొమ్మతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీ సెంటర్ వరకు శవయాత్ర నిర్వహించారు.
మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాము కట్టిన పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు మంత్రి తుమ్మల.