తెలంగాణ
ఎమ్మెల్యే కాలనీలో ఉద్రిక్తత.. ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత పెద్దమ్మతల్లి ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో గుట్టలపై ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగించి..నూతనంగా నిర్మిస్తున్న భవన్‌లోకి భక్తులు మార్చారు. అయితే గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయాన్ని కూల్చిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.