ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. కంచిలి మండలం సామంత పుట్టుక గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. గ్రామదేవత ఉత్సవాల్లో అలంకరణ వైర్లు తెగిపడటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మృతులు ఈశ్వర్, ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు. ప్రమాదంలో మరో రెండేళ్ల చిన్నారి మనోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.