తెలంగాణ

పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తా.. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి బెదిరింపులు

సర్పంచ్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తానంటూ ఓ ట్రాన్స్‌జెండర్‌‌ను బెదిరిస్తున్నారు. కొందరు నాయకులు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి సర్పంచ్ అభ్యర్థిగా సాధన నామినేషన్ వేశారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని మొదట ఒత్తిడి తెచ్చిన సాధన భయపడలేదు. నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదు. అధికారులు గుర్తు కూడా కేటాయించారు.

దీంతో ఎన్నికల ప్రచారం చేయడం ప్రారంభించిన సాధనకు కొందరి నేతల నుండి బెదిరింపులు వస్తున్నాయి. ఎన్నికల నుండి తప్పుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని సాధన ఆందోళన వ్యక్తం చేసింది. తనను చంపుతామని బెదిరించిన వారి ఫోన్‌కాల్స్‌ రికార్డులు తనవద్ద ఉన్నాయని తనను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసింది సాధన.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button