తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో యువకుడిపై ఎస్సై థర్డ్ డిగ్రీ

Vikarabad: ఓ హత్య కేసులో అనుమానితుడిని విచారణకు పిల్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానితుడు ఫిరోజ్‌ను స్టేషన్‌కు పిలిపించి లాఠీలతో చితకబాదారు. ఇద్దరు కానిస్టేబుళ్లు రఫిక్, మురళితో పాటు ఎస్సై వేణు కుమార్ తనను 40 నిమిషాల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఫిరోజ్ ఆరోపిస్తున్నాడు.
ఆ హత్య తానే చేశానని ఒప్పకోవాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చారని బాధితుడు తెలిపారు. పోలీసుల థర్డ్ డిగ్రీతో అస్వస్థతకు గురైన ఫిరోజ్ చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



