తెలంగాణ
Hyderabad: మధురానగర్‌లో లేడీస్ హాస్టల్‌లో దొంగ హల్‌చల్

Hyderabad: హైదరాబాద్‌లోని మధురానగర్‌లో లేడీస్ హాస్టల్‌లో దొంగ హల్‌చల్ సృష్టించాడు. అర్ధరాత్రి దాటాక లేడీస్ హాస్టల్స్‌లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒకే దొంగ రెండు హాస్టల్‌లలో దొంగతనం చేసి పరారయ్యాడు. ప్రహరీ గోడ ఎక్కి దూకి అత్యంత జాగ్రత్తగా దొంగతనం చేశాడు. తెల్లవారుజామున లేచి చూసిన అమ్మాయిలు అవాక్కయ్యారు.
తమ వస్తువులు కనిపించకపోవడంతో హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలు చూస్తే షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దొంగ లోపలికి రావడం మళ్లీ ఎంచక్కా హాయిగా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.