The Raja Saab: ది రాజా సాబ్ విడుదలపై ఆగని సస్పెన్స్!

The Raja Saab: ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ నెలకొంది. నిర్మాతలు, హిందీ డిస్ట్రిబ్యూటర్లు, తెలుగు సినీ పరిశ్రమ మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా విడుదల తేదీపై చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. మొదట డిసెంబర్ 5, 2025న విడుదల చేయాలనుకున్నా, హిందీ డిస్ట్రిబ్యూటర్లు AA ఫిల్మ్స్ ఆ తేదీకి వ్యతిరేకించారు. ఆ రోజు షాహిద్ కపూర్ రోమియో, రణవీర్ సింగ్ ధురంధర్ సినిమాలు వస్తుండటంతో హిందీ మార్కెట్‌లో పోటీ ఎక్కువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ OG, చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ అఖండ 2 సినిమాలతో పోటీని తప్పించేందుకు జనవరి 9, 2026కి వాయిదా వేయాలని సూచిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఆలస్యమైన ఈ చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రజెంట్ ప్రభాస్ కి సలార్, కల్కి 2898 AD విజయాలతో హిందీ మార్కెట్‌లో బలమైన ఆధారం ఉంది. ఈ నేపథ్యంలో, అన్ని పక్షాలు కలిసి ఉత్తమ విడుదల వ్యూహం కోసం చర్చలు జరుపుతున్నాయి.