తెలంగాణ
Hyderabad: దారుణం.. పదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపిన సవతి తండ్రి

Hyderabad: హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిని సవతి తండ్రి నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. భర్త ఉండగానే మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది యువతి. అయితే మొదటి భర్తతో కలిగిన సంతానం మొహమ్మద్ అజ్‌హర్ ఇరుగురు పొరుగు వారితో గొడవ పడడంతో పిల్లలను ఇలాగానే పెంచేది అని పొరుగు ఇంటి వాళ్లు అనడంతో ఆగ్రహించిన రెండో భర్త రోడ్డుకేసి కొట్టాడు.
తీవ్రంగా గాయాపడిన బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



