తెలంగాణ

వేములవాడ రాజన్నను దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి

Vemulawada: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణంకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అద్దాల మండపలంలో భక్తులకు అశీర్వాదం అందించారు.

అనంతరం రాజన్న ఆలయ విస్తరణ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబేషన్‌ పరిశీలించారు. అనంతరం దేవాలయ పరిసరాల్లో ఉన్న కోటిలింగాల ఆలయాన్ని సందర్శించారు పీఠాధిపతి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button