అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు

పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు పొందుగల వద్ద కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల సిబ్బంది పనితీరును అధికారులు తమ తనిఖీల్లో ప్రత్యక్షంగా పరిశీలించారు.
రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయాలని, యూరియా సరిహద్దు దాటి వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో వారు చర్చించి, తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జగదీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు, ఏవో వెంకటేశ్వర్లు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



