Raja Saab: రాజా సాబ్ నుంచి ఫస్ట్ పాట వచ్చేస్తుంది!

Raja Saab: ప్రభాస్ నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. మారుతీ దర్శకత్వంలో థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి ఫ్యాన్స్‌కి మ్యూజికల్ ట్రీట్ సిద్ధమవుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇంట్రో గ్లింప్స్, టీజర్‌లోని బీట్స్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఆగస్ట్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సోలో సాంగ్ ప్రభాస్‌పై డిజైన్ చేసినట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థమన్ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్‌లో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్‌లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.