రాశి ఖన్నా: వరుస ప్లాపులైన తగ్గేదేలే?

Raashii: రాశీ ఖన్నా టాలీవుడ్‌లో ఆరేళ్లుగా హిట్ మీద హిట్ కొట్టలేకపోతోంది. ఈ ఏడాది మూడు ఫ్లాపులు మూట గట్టుకుంది. అయినా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కీ రోల్ చేస్తోంది. మెగా హీరోలతో ఆమె సినిమాలు హిట్ అవుతాయన్న సెంటిమెంట్ నిజమవుతుందా అన్నది ప్రశ్నగా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఒకప్పుడు వరుస హిట్లతో అభిమానులను సొంతం చేసుకున్న రాశీ ఖన్నా.. ఇప్పుడు వరుస ఫ్లాపులతో కెరీర్ సవాళ్లు ఎదుర్కొంటోంది. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత టాలీవుడ్‌లో ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది. ఈ ఏడాది ‘తెలుసు కదా’, ‘అగత్య’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. బాలీవుడ్‌లోనూ ‘120 బహద్దూర్’, ‘యోధ’, ‘ద సబర్మతి రిపోర్ట్’ డిజాస్టర్లుగా నిలిచాయి. కానీ తమిళంలో ‘ఆర్ణమనై 4’ హిట్‌తో కొంత ఊరట లభించింది. ప్రస్తుతం రాశీ చేతిలో ‘ఫర్జీ 2’, ‘తలాఖో మే ఏక్’, ‘రౌడీ అండ్ కో’ సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఏకైక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్‌తో ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది.



