ఆంధ్ర ప్రదేశ్
Kadapa: ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక టీచర్ ఆత్మహత్యాయత్నం

కడప జిల్లా వనిపెంట గురుకుల పాఠశాల నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుంది. కాగా ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక బయాలజీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఆమెకు పాఠాలు చెప్పడం రావడంలేదని వేధిస్తుందని, తన ఇంట్లో పనికి పిలుచుకుంటానని ప్రన్సిపల్ వేధిస్తున్నట్లు బాధితురాలి బంధువులు వెల్లడించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు బంధువులు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.