ది గర్ల్ ఫ్రెండ్: అంచనాలకు అడ్డుకట్ట!

The Girlfriend: రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? హైప్ కి తగ్గట్టు ఉందా? అసలు ఈ సినిమా ఎలా ఉంది? పూర్తి వివరాలు చూద్దాం.
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు. అంచనాలు లేకుండా చూస్తే నచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ సాధారణంగా సాగింది. సెకండ్ హాఫ్ కొంచెం మెరుగైన డ్రామాను అందించింది. అర్థవంతమైన క్లైమాక్స్‌తో ముగిసింది. జెన్యూన్ అటెంప్ట్‌గా నిలిచింది. కానీ కొత్తదనం లేదు. రష్మిక, దీక్షిత్ శెట్టిలకు ఈ కథ సెట్ కాలేదు.
సపోర్టింగ్ క్యాస్ట్‌కు స్కోప్ తక్కువ. కథలో, భావోద్వేగాల్లో ప్రభావం సరిపోలేదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. సినిమా నెమ్మదిగా సాగడం ఓపికను పరీక్షించింది. డ్రాగ్, పొడిగించిన షాట్స్ ఉన్నాయి. డైరెక్టర్ రాహుల్ అనుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించడంలో విఫలం అయ్యాడు. సినిమా బాగా ల్యాగ్ అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.



