సినిమా

లెనిన్’ ఫస్ట్ సింగిల్ రెడీ!

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారైంది. నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో అఖిల్ కూల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ చిత్రం పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

నూతన సంవత్సర కానుకగా ఫస్ట్ సింగిల్ జనవరి 5న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అఖిల్ కాలర్ ఎగరేస్తూ కూల్ మాస్ లుక్‌లో కనిపించారు. కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న ఈ పోస్టర్ అంచనాలను మరింత పెంచింది. రూరల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న లెనిన్ వేసవి కానుకగా రిలీజ్ అవుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button