అంతర్జాతీయం

US-China: చైనా-అమెరికా మధ్య ముదురుతున్న వార్

US-China: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలన్నీ అమెరికాకే వ్యతిరేకంగా మారుతున్నాయి. మరోవైపు అన్నీ తమకే కావాలన్న స్వార్థంతో ట్రంప్‌ ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. ప్రపంచంలో అరుదుగా లభించే ఎర్త్‌ మినరల్స్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదువుపుతున్నారు. చైనాపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎక్కడా తగ్గడం లేదు. అగ్రరాజ్యానికే సవాల్‌ విసురుతోంది. ఇంతకీ చైనా తీసుకున్న నిర్ణయం ఏంటి..? డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కోబోతున్న కొత్త సవాల్ ఏంటి..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. స్వార్థానికి కేరాఫ్ అడ్రస్. తన కోసం తన పని కావడం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాడు. తను అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. దీంతో ట్రంప్ ఆయా దేశాలపై సుంకాల మోత మోపుతున్నాడు. ఎర్త్ మినరల్స్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు. చైనాపై భారీగా సుంకాలు కూడా విధిస్తున్నాడు.

దీంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అగ్రరాజ్యానికి ఇప్పుడు చైనా కొత్త సవాల్ విసురుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అమెరికా మిలిటరీ టెక్నాలజీకే ఎసరు వచ్చేలా ఉంది. చైనా తాజాగా రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై నియంత్రణలు కఠినం చేసింది. ఈ లోహాలే ఆధునిక మిలిటరీ, సెమీకండక్టర్, గ్రీన్‌ ఎనర్జీ టెక్నాలజీలకు ప్రాణాధారం. అమెరికా, యూరప్, జపాన్‌ వంటి దేశాలు ఇప్పటి వరకు ఇవి ఎక్కువగా చైనాపై ఆధారపడ్డాయి. ఇప్పుడు బీజింగ్‌ పట్టుబిగించడంతో ఆ ఆధార వ్యవస్థే కదిలిపోయింది.

రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌లో నియోడియమియం, ప్రాసియోడియమియం, డిస్ప్రోస్యియం వంటి లోహాలు ప్రధానమైనవి. వీటితో జెట్‌ ఇంజిన్లు, క్షిపణి నియంత్రణ వ్యవస్థలు, రాడార్‌ సెన్సర్లు, మొబైల్‌ ఫోన్లు నిర్మించబడతాయి. ప్రపంచంలోని సుమారు 70శాతం సరఫరా చైనాకు చెందిన గనుల నుంచే వస్తుంది. ఒక గనిలో ఉత్పత్తిని తగ్గించినా ప్రపంచ మార్కెట్లో ధరలు క్షణాల్లో పెరుగుతాయి.

టెక్నాలజీ ఆధిపత్యం కోసం ప్రతిదశలో చైనాకు సవాలు విసిరిన అమెరికా ఇప్పుడు రేర్‌ ఎర్త్‌ సరఫరాలో బంధింపబడిన స్థితిలో ఉంది. మిలిటరీ సాధనాలు, జాతీయ రక్షణ పరిశ్రమల ఉత్పత్తి ఆలస్యమవుతోంది. టెక్‌ కంపెనీలు ప్రత్యామ్నాయ మూలాలు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని తక్షణ పరిష్కారం లేదు. దీంతో వాషింగ్టన్‌ మళ్లీ భారత్‌ వంటి మిత్రదేశాల సహకారం కోసం చూస్తోంది.

ఇదే విషయంపై అమెరికా గతంలో వాణిజ్య టారిఫ్‌లతో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మారడంతో భారత్‌ సహకారం తప్పనిసరైంది. భారత్‌లోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో రేర్‌ ఎర్త్‌ ఖనిజ వనరులను అభివృద్ధి చేసే దిశగా ముందుకువెళ్తోంది. ఇది భారత్‌కు ద్విగుణ ప్రయోజనం. ఒకటి వ్యూహాత్మక చర్చల్లో ప్రాధాన్యం పెరగడం.

రెండోది అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించగలగడం. మరోవైపు.. చైనా టెక్నాలజీ ఆయుధంగా రేర్‌ ఎర్త్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. దీంతో అమెరికా, యూరప్‌ తమ పరిశ్రమల్లో కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ ఇవి వాడే బ్యాటరీలు, టర్బైన్‌లు ప్రాజెక్టులు మందగిస్తున్నాయి. టెక్‌ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామాలు చైనా సైలెంట్‌ వెపన్‌ ప్రభావాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి.

రేర్‌ ఎర్త్‌ యుద్ధం కేవలం మినరల్‌ సప్లై పోరు కాదు.. ఇది భవిష్యత్తు టెక్నాలజీ ఆధిపత్యంపై పోరాటం. చైనా ఒకే నిర్ణయంతో ప్రపంచ సరఫరా గొలుసును కుదిపేసింది. భారత్‌ వంటి దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా కొత్త అవకాశాల సరిహద్దులో నిలిచాయి. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.

ఇదిలా ఉంటే, భారత్ కూడా రేర్ ఎర్త్ అయస్కాంతాల కోసం చైనాపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో, భారత్‌కు ఎగుమతి చేసే అరుదైన అయస్కాంతాలను అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకూడదని చైనా, మన దేశం నుంచి హామీ కోరుతున్నట్లు సమాచారం. ప్రపంచంలో ప్రాసెస్ చేయబడిన రేర్ ఎర్త్ మెటీరియల్స్, అయస్కాంతాల్లో 90 శాతం కంటే ఎక్కువ చైనానే ఉత్పత్తి చేస్తోంది. ఈ 17 రకాల అరుదైన మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలల తయారీ నుంచి విమాన ఇంజన్లు, సైనిక రాడార్ల వంటి ఉత్పత్తుల్లో ఇవి కీలకంగా ఉంటాయి.

భారతదేశానికి సరఫరా చేసే రేర్ ఎర్త్ అయస్కాంతాలు అమెరికాకు చేరకుండా చూడాలని చైనా కోరుతోంది. అయితే, భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇలాంటి అభ్యర్థనను అంగీకరించలేదని విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు.

చైనా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్‌ ద్వారా అమెరికాతో ఏదో ఒక డీల్ కుదుర్చుకోవాలని, బేరసారాలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ ఖనిజాలను ప్రాసెస్ చేసే టెక్నాలజీపై కూడా చైనా నియంత్రణ విధిస్తోంది. దక్షిణ కొరియాలో అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జి జిన్‌పింగ్ మధ్య సమావేశం జరగడానికి వారాల ముందు నియంత్రణలను కఠినతరం చేయడం జరిగింది.

కాగా, ఈ నెల చివర్లో సౌత్ కొరియాలో జరిగే అపెక్ సమిట్ సందర్భంగా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే, జిన్ పింగ్‏తో భేటీ అయ్యేందుకు ఇప్పుడు అవసరమేమీ లేదంటూ ట్రంప్ కామెంట్ చేశారు. తాజాగా అదనపు టారిఫ్‎లనూ ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్​ మరింత ముదిరినట్లయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button