ఆంధ్ర ప్రదేశ్

ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం సంగం వాగులో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దొంతి కుంట గ్రామానికి చెందిన గుమ్మళ్ల జస్వంత్ ఆదివారం సంగం వాగుకు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు.

వాగులో ఈతకు దిగాక ప్రమాదవశాత్తు జస్వంత్ నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సహాయంతో మృతదుహాన్ని పైకి తీసి స్వగ్రామానికి తరలించారు. కొడుకు మరణంతో కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు కుటుంబసభ్యులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button