తెలంగాణ

మరణంలోనూ వీడని భార్యభర్తల బంధం!

కష్టసుఖాల్లో ఒకరికొకరు కలకాలం తోడుగా ఉంటామని చేతిలో చేయ్యేసి ఒట్టు పెట్టిన ఆ దంపతులు కాటికీ కలిసే వెళ్లారు. భార్య మరణించిన కొద్దిసేపటికే భర్త కుడా తనువు చాలించిన విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండేలా గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సతయ్య, ఎల్లమ్మ ఇద్దరు దంపతులు.

18 ఏళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంతో మంచానికే పరిమితమైంది భార్య ఎల్లమ్మ. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న భర్త సతయ్య తనకు సేవలు చేయడం తట్టుకోలేక మూడు రోజుల నుండి ఆహారం మానేసింది. దీంతో ఉదయం ఎల్లమ్మ మృతి చెందగా భార్య మృతి తట్టుకోలేని సతయ్య గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. భార్యభర్తలు ఇద్దురు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button