తెలంగాణ
BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బొక్కబొర్ల పడ్డ బీజేపీ

BJP: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. బైపోల్ ఫలితాల్లో బొక్కబోర్లా పడింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడంతో కమలానికి నిరాశే ఎదురైంది. కేంద్రమంత్రులు రంగంలోకి దిగినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అయితే బీజేపీ నేతలు మాత్రం తమదే గెలుపని చెప్పినా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి.
అయితే ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే సస్పెన్స్ కు తెరతీస్తూ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీలు రెండవస్థానానికి చేరుకుంటాయనే ఉత్కంఠ మధ్య బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది.



