థాయ్‌ల్యాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్తత

థాయ్‌ల్యాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డర్ వద్ద ఫైరింగ్ జరిపారు. బోర్డర్ ఫైరింగ్‌తో రెండు దేశాల్లో ఉద్రిక్తలు మళ్లీ మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా బోర్డర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. అయితే తాజా ఫైరింగ్‌తో మళ్లీ పరిస్థితులు కొత్త దశకు చేరుకున్నాయి. ముందు మీరే కాల్పులు జరిపారంటూ రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి.
కాంబోడియాతో ఉన్న ఈశాన్య బోర్డర్‌ను ఇటీవల థాయ్‌ల్యాండ్ మూసివేసింది. తమ అంబాసిడర్‌ను వెనక్కి రప్పిస్తున్నామని, కాంబోడియా దౌత్యవేత్తను పంపించేస్తున్నామని థాయ్ పేర్కొన్నది. బోర్డర్ వద్ద జరిగిన ల్యాండ్ మైన్ బ్లాస్ట్‌లో థాయ్ సైనికులు గాయపడ్డారు. ఆ ఘటనకు వ్యతిరేకంగా థాయ్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో థాయ్‌ల్యాండ్‌తో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటున్నట్లు కాంబోడియా ప్రకటించింది. బ్యాంగ్‌కాక్‌లో ఉన్న ఎంబసీ సిబ్బందిని కూడా కాంబోడియా వెనక్కి రప్పించింది.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన దరిమిలా థాయ్- కంబోడియా సైనికుల పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. పేలుళ్ల థాయ్‌లాండ్ , కంబోడియాలు ఎవరు తొలుత కాల్పులు జరిపారనే దానిపై వాదనలు చేసుకున్నాయి. ఈ ఆగ్నేయాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మే నెల నుండి క్షీణిస్తూ వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న సాయుధ ఘర్షణలో కంబోడియా సైనికుడొకరు మృతిచెందారు.
సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి, ముగ్గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.