ఆంధ్ర ప్రదేశ్
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి ఇంటి వద్ద అధికారులు సర్వే చేయనున్నారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించారని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. పుటూరు దగ్గర కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడిపత్రికి వెళ్లాలని ఎస్పీ సూచించారు. తాడిపత్రిలో జేసీ ,కేతిరెడ్డి ఇళ్ల దగ్గర పోలీసు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.



