ఆంధ్ర ప్రదేశ్

కడప జిల్లా ఒంటిమిట్టలో తీవ్ర ఉద్రిక్తత

కడప జిల్లా ఒంటిమిట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన రహదారిపై వైసీపీ నేతలు నిరసన తెలిపారు. టీడీపీ దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలింగ్ బూత్‌లో టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంబాద్ బాషా, ఎమ్మెల్సీ గోవిందారెడ్డి, ఎమ్మెల్యే సుధ, కడప మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.

చిన్న కొత్తపల్లి పోలింగ్ స్టేషన్‌లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఏజెంట్లపై ప్రతి దాడి చేశారు. చిన్న కొత్తపల్లి పోలింగ్ స్టేషన్ సమస్యాత్మకంగా మారింది. ఘటన స్థలాన్ని మంత్రి రాంప్రసాద్ పరిశీలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button