నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్‌లో ఆందోళన

Narayankhed: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బీసీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ శారద కుమారుడు ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. మాజీ కౌన్సిలర్ రాజేష్ విద్యార్థినులను వేధిస్తున్నాడు. వసతి గృహంలో వార్డెన్‌గా పనిచేస్తున్న శారద హాస్టల్‌కు రాని సమయంలో హాస్టల్‌లోకి చొరబడి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు వాపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నాడని మండిపడ్డారు.
ఎక్కడినుంచో చదువుల కోసం పిల్లలను పంపుతున్నామని వారికి ఇలాంటి వేధింపులు ఉంటే ఎలా బ్రతుకుతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని, వార్డెన్ కుమారుడు రాజేష్ చౌహాన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధికారులు స్పందించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.