ఆంధ్ర ప్రదేశ్
నర్సాపురంలోని తుంగపాటి చెరువు వద్ద ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని తుంగపాటి చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు స్థలంలో చెత్త వేయడానికి వచ్చిన ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న స్థానికులని అదుపులోకి తీసుకుని వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.



