ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్మెంట్లలో వేల మంది భక్తులు వేచి ఉన్నారు. వారికి దర్శనం దక్కేందుకు దాదాపు 12 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 71,208 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 23,135 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా హుండీ ద్వారా రూ. 3.84 కోట్ల ఆదాయం నమోదైంది.



