ఆంధ్ర ప్రదేశ్
మన్యంలో మంచు దుప్పటి

పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి భయపెడుతుంటే, మరోవైపు కనువిందు చేస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. గ్రామీణ ప్రజలు చలి మంటలతో తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు.



