అంతర్జాతీయం
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నికిత రావు.. మేరీల్యాండ్‌లోని తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉంది. నికిత ఒంటిపై పోలీసులు కత్తిపోట్లను గుర్తించారు. నికిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు అర్జున్ కంప్లైంట్ చేశాడు. అదే రోజు అమెరికా విడిచి భారత్‌కు వెళ్లిపోయాడు అర్జున్ శర్మ.



