తెలంగాణ
మంచిర్యాల జిల్లాను వణికిస్తున్న చలి

మంచిర్యాల జిల్లాలో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా చెన్నూర్, కోటపల్లి, బీర్మపల్లి, లింగంపల్లి మండలాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతకు ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం వణుకుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక చలి మంటలు కాచుకుంటున్నారు స్థానికులు.
ముఖ్యంగా కోటపల్లి మండలంలో అత్యల్పంగా 11.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చారించారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే బయటకు వెళ్లే వారు గోరువెచ్చని బట్టలు ధరించాలని, చల్లని గాలికి ఎక్కువగా తిరగకుండా ఉండాలని సూచించారు అధికారులు.



