Tollywood : ఎంప్లాయిస్ ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్

Tollywood: టాలీవుడ్‌లో ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ అన్నట్లు వార్ నడుస్తుంది. 30 శాతం వేతనాల కోసం సినీ కార్మికుల డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చిచెప్పరు నిర్మాతలు. డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్‌కు వస్తామంటున్నారు కార్మికులు. అయితే కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. కొత్తవాళ్లతో షూటింగ్స్ చేస్తామంటుంది ఛాంబర్. అయితే ఛాంబర్ నిర్ణయంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇక మరోవైపు ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బంద్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. బయటి వారితో షూటింగ్‌లకు రెడీ అయ్యారు ప్రొడ్యూసర్లు. ఛాంబర్‌కి అనుబంధంగా ప్రొడ్యూసర్ గిల్డ్‌తో కలిపి కొత్త టెక్నీషయన్లను తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు ఇచ్చింది. వెయ్యి రూపాయలతో టెక్నీషియన్లకు కొత్త మెంబర్‌షిప్ కార్డులు ఇస్తామని ఛాంబర్ వెల్లడించింది.



