తెలంగాణ

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు.ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ ఉద్యమంలో తన కలంతో ప్రజల్లో జ్వాలలు రగిలించిన అందెశ్రీ, రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ద్వారా అమరుడయ్యారు. ఆయన రచనలు ప్రజల్లో తెలంగాణ గర్వభావాన్ని, ఆత్మగౌరవాన్ని నింపాయి. కవి, రచయిత, తెలంగాణ పోరాట యోధుడిగా అందెశ్రీ పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని సాహిత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button