అంతర్జాతీయం
అమెరికాలోని చికాగోలో తెలంగాణ విద్యార్ధిని మృతి

అమెరికాలోని చికాగోలో తెలంగాణ విద్యార్ధిని మృతి చెందింది. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మలో నివాసం ఉండే శ్రీనివాస్ రావు పెద్ద కుమార్తె శ్రీజ వర్మ ఉన్నత చదువు కోసం అమెరికాకు వెళ్లింది. చికాగోలో ఉంటున్న శ్రీజ భోజన చేయడం కోసం అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్ ఢీకొట్టింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీజ వర్మ మృతిచెందింది. శ్రీజ ఉన్నత చదువుల కోసం వెళ్లి మృత్యుఒడిలోకి వెళ్లడంతో గండి మైసమ్మలోని నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.



