తెలంగాణ
SLBC Tunnel: ఆపరేషన్ వేగవంతం.. గల్లంతైనకార్మికులకోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు

SLBC Rescue Operation : ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.
కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చు.