తెలంగాణ
Delhi: బనకచర్లపై చర్చ అవసరం లేదంటున్న తెలంగాణ

Delhi: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరుపుతామని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలను జలశక్తి శాఖ ఆహ్వానించింది. మరోవైపు బనకచర్లపై చర్చకు రాబోమని లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్.
బనకచర్లపై చర్చే అవసరం లేదంటున్నారు. మిగిలిన జలవివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. మీటిం గ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. మరోవైపు మీటింగ్ ఎజెండా బనకచర్లనే అని ఏపీ పెట్టుకుంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కూడా కలిశారు.